ఉల్లి పాయ పులుసు
కావలిసినవిఉల్లి పాయ ముక్కలు-10
కంది పప్పు-1/2 కప్పు
చింత పండు- కప్పు లో 1/4th
ఉప్పు -తగినంత
కారం -తగినంత
ఇంగువ -తగినంత
కరివేపాకు -కొద్దిగా
కొత్తి మిర -కొద్దిగా
ఆవాలు -కొద్దిగా
మినపప్పు -కొద్దిగా
ఎండు మిరపకాయ ముక్కలు -3
చేసేవిదానం
కంది పప్పు ను ఉడక పెట్టుకొవాలి.
చింత పండు రసం తీసుకోవాలి.
ఒక గిన్నే లొ నూనే వేసి కాగిన తరువాత ఉల్లి పాయ ముక్కలు,వేసి మగ్గిన తరువాత, చింత పండు రసం ని వేసి పొయ్యి మీద ఒక్క ఉడుకు రాని ఇవ్వాలి.
దానిలో నే ఉప్పు వేసి ఇంకొ ఒక్క ఉడుకు రాని ఇవ్వాలి.
దానిలో నే పులుసు పొడి వేసి ఇంకొ ఒక్క ఉడుకు రాని ఇవ్వాలి.
దానిలో నే కారం వేసి ఒక్క ఉడుకు రాని ఇవ్వాలి.తరువాత ఉడక పెట్టుకున్న కంది పప్పు ను వేసి బాగ తెర్ల నించి ,పొపు(బాండి లొ కొద్దిగ నూనే వేసి కాగిన తరువాత ఆవాలు,మినపప్పు,ఎండు మిరపకాయ ముక్కలు,ఇంగువ వెయ్యడమే) పెట్ట్టి,దించే ముందు కరివేపాకు,కొత్తి మిర వేసి తినడమే...:)
No comments :
Post a Comment