Thursday, September 26, 2013

      పరమాన్నం

  1. పందార
  2. బెల్లం
  3. సగ్గు బియ్యం
  4. పాలా పరవాన్నం
  5. శనగపప్పు
  6. పెసర పప్పు
  7. చెక్కర పొంగలి
  8. చెరకు రసం పరమాన్నం
  9. జొన్న పరమాన్నం
  10. మామిడి పరమాన్నం

 పందార పరమాన్నం

కావలిసినవి


బియ్యం : 1 కప్పు 
పాలు : 2 కప్పులు 
పందార:1/2  కప్పు
నెయ్యి : తగినంత 
యాలకులు : 4 


చేసే విదానం


మొదట బియ్యం కడిగి 2 కప్పుల నీరు పోసి ,3 విసిల్స్ వచ్చిన తరువాత కట్టేయాలి...ఈ అన్నము ను ఒక గిన్నే లో తీసుకొని ,దానిలో పాలు పొసి ఒక్క ఉడుకు రానించి,పందార వేసి ,యాలకులు  వేసి,నెయ్యి కూడ వేసి , దేవుడికి నైవేద్యము పేట్టడమే...

బెల్లం పు  పరమాన్నం

కావలిసినవి


బియ్యం : 1 కప్పు 
పాలు : 2 కప్పులు 
బెల్లం
 
:1/2  కప్పు
నెయ్యి : కొద్దిగ 
యాలకులు : 4 


చేసే విదానం

మొదట బియ్యం కడిగి 2 కప్పుల నీరు పోసి ,3 విసిల్స్ వచ్చిన తరువాత కట్టేయాలి...ఈ అన్నము ను ఒక గిన్నే లో తీసుకొని ,దానిలో పాలు పొసి ఒక్క ఉడుకు రానించి,పందార వేసి ,నెయ్యి కూడ వేసి ,
యాలకులు  వేసి దేవుడికి నైవేద్యము పేట్టడమే...

సగ్గుబియ్యం పరమాన్నం




కావలిసినవి

బియ్యం - 1/4  కప్పు

సగ్గుబియ్యం -1/4 కప్పు 

పాలు - 1/2 
కప్పు 

నీళ్ళు - ఒక కప్పు 

జీడుపప్పు - కొంచం 

బాదాంపప్పు - కొంచం 

కిస్మిస్స్ - కొంచం

నెయ్యి - రెండు స్పూనులు

పంచదార - 
1/4 కప్పు


చేసే విదానం


                                సగ్గుబియ్యం ,  బియ్యం కడిగి  నీళ్ళు పోసి ఉడక పెట్టాలి . ఒక గిన్న తీసుకొని దానిలొ పాలు పొసి ఉడికిన అన్నం,సగ్గు బియ్యం వేసి బాగ కలిపి,పంచదార వేసి,బాగ కలిపి,నేతి లో వేయించుకున్న జీడుపప్పు ,బాదాంపప్పు,కిస్మిస్స్ వేసి బాగా కలపడమే...అంతే సగ్గుబియ్యం పరమాన్నం సిద్దం

గమనిక:నేను నేతి లో వేయించుకున్న జీడుపప్పు ,బాదాంపప్పు,కిస్మిస్స్ అవి వెయ్యలేదు 

 పాలా పరవాన్నం













 శనగపప్పు పరమాన్నం

బియ్యం 1 cup
శనగపప్పు 1/2 cup
పచ్చి కొబ్బరి 1/2 cup
యాలకుల పొడి 2 tsp
పాలు 1 కప్
బెల్లం 1 కప్
నెయ్యీ 5 tbsp

ముందుగా బియ్యం, శనగపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి కొద్దిగా నెయ్యి వేసి
కుక్కర్లో ఉడికించాలి. తర్వాత దీనిలో బెల్లం వేసి మంట తగ్గించి నిదానంగా
ఉడికించాలి. నెయ్యి వేడి చేసి పచ్చికొబ్బరిని తురుము దోరగా వేయించి అందులో
కలిపి, యాలకుల పొడి వేసి పాలు కూడా వేసి బాగా కలుపుతూ అడుగు
మాడకుండా నెమ్మదిగా దగ్గరపడేవరకు ఉడికించాలి. తర్వాత దింపేయాలి.
కావాలంటే నెయ్యిలో వేపిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది చాలా
రుచిగా ఉంటుంది.

చెక్కర పొంగలి


కావలసిన పదార్థాలు :

బియ్యం--3/4 గ్లాస్
శనగ పప్పు--1/4 గ్లాస్
బెల్లం--3/4 గ్లాస్
ఏలకులు--4
జీడిపప్పు--8
ఎండు ద్రాక్ష--8
నెయ్యి--6 స్పూన్స్
పచ్చ కర్పూరం--చిటికెడు


విధానము:

1.బియ్యం+శనగపప్పు బాగా కడిగి 2 గ్లాసులు నీరు వేసి కుక్కర్ పెట్టి 2 విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.

2.తరువాత బాణలి పెట్టి 3 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి దోరగా వేయించాలి.

3.తరువాత ఉడికించిన బియ్యం శనగ పప్పు, బెల్లం పొడి, కొద్దిగా నీరు వేసి బాగా కలపాలి.

4.తరువాత అన్నంలో బెల్లం బాగా కరిగి, ముద్దగా అయ్యాక ఏలకుల పొడి, పచ్చ కర్పూరం, 3 స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే చెక్కర పొంగలి/పరమాన్నం రెడి.ఇది పండుగ రోజులలో ఎక్కువగా చేసుకుంటారు 


చెరకు రసం పరమాన్నం

కావలసినవి

బియ్యం - 1 కప్పు

చెరకురసం - మూడు కప్పులు

యాలకుల పొడి - ఒక స్పూన్

నెయ్యి - మూడు స్పూన్లు

ఇలా చేద్దాం

 బియ్యం కడిగి నీళ్లు పోసి అరగంట నాననిచ్చి ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత చెరకు రసం

 పోసి మెత్తగా ఉడికి దగ్గరపడేవరకు ఉంచాలి... మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి... చివరలో 

యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి.


జొన్న పరమాన్నం


కావలసిన పదార్థాలు :జొన్నలు -ఒకకప్పుబెల్లం ఒకకప్పు ,యాలకులు -నాలుగు,జీడిపప్పు 

-ముడుస్పూన్, బాదం-ఆరు ,ఎండుదక్ష -ముడుస్పూన్,నెయ్యి -ఇదు స్పూన్,పాలు -పావు లీటర్.


తయారీ విధానం :జొన్నలనుకడిగి నాలుగు గంటల పాటునీళ్ళలో నాననివాలి.ఈపుడు జీడిపప్పు 

,బాదం,ఎండు దక్ష ,నెయ్యి లో వైఇంచితీసి పెట్టుకోవాలి .ఒక బాణలోజొన్నలు సరిపడా 

నీళ్ళుతీసుకోని స్టవ్,మీద పెట్టాలి.ఆవిబాగా ఉడికిన తరువాత మంట తగించి బెల్లం ,యాలకుల

 పొడి ,బాదం ,జీడిపప్పు ,ఎండు దక్ష పలుకులు వేసి బాగా కలపాలి .ఇదు నిముషాలు అయిన 

తరువాత పాలు కూడా వేసికిందకుదించాలి .అంతేకమ్మని జొన్న పరమాన్నం రడి .


మామిడి పరమాన్నం

కావలసిన పదార్థాలు
మామిడిపండ్లు - 2 (పెద్దవి)
బియ్యం - 4 కప్పులు, జీడిపప్పు - 2 స్పూన్లు
బాదం పొడి - 2 స్పూన్లు, యాలకుల పొడి - 1 స్పూన్‌
ఎండుద్రాక్ష - 2 స్పూన్లు
బెల్లం - 100 గ్రాములు
తయారీ విధానం

మామిడిపండ్లను శుభ్రంగా కడిగి రసం తీయాలి. బియ్యం కడిగి అన్నం వండాలి. అన్నం ఉడికాక సన్నని మంటపై ఉంచి బెల్లం పొడి వేసి బాగా కలపాలి. అందులోనే యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయాలి. చివరిలో బాదంపొడి చల్లి స్టౌ ఆపేయాలి. పరమాన్నం పూర్తిగా చల్లారాక మామిడిరసం కలపాలి. అంతే మామిడి పరమాన్నం తయార్‌.







No comments :

Post a Comment