Tuesday, October 26, 2010

చిట్కాలు

చిటికెడు వంటసోడాను టీ కప్పులలో వేసి నిమిషం తరవాత శుభ్రపరిస్తే లేయర్‌లా ఏర్పడిన టీ మరకలు మటుమాయం అవుతాయి.

పిండివంటలు చేసిన తరవాత చుట్టుపక్కల ఏర్పడిన జిడ్డు మరకలు పోవాలంటే- వాటి మీద కొద్దిగా ఏదయినా పొడి పిండి జల్లి పేపర్‌తో తుడిచేస్తే సరి.

కొత్తిమీర, పుదీనా వంటి పచ్చళ్లను తయారుచేసుకున్నప్పుడు వీటిలో కొంచెం నిమ్మరసం పిండి ఫ్రిజ్‌లో పెడితే వాటి రంగు మారకుండా తాజాగా ఉంటాయి.

ఆకుకూరలు తాజాగా ఉండాలంటే కడిగి చిన్నముక్కలుగా కట్ చేసుకుని, న్యూస్‌పేపర్‌లో చుట్టి, పాలిథిన్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి.

ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు లేదా పంచదార వేయాలి

వెల్లుల్లి రేకల పొట్టు త్వరగా రావాలంటే కొద్దిగా వేడి చేసి ఒలిస్తే సరిపోతుంది.


లంచ్ బాక్స్ శుభ్రం చేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు వాసన వస్తుంటాయి, ప్లాస్టిక్ మూతలపై నూనె మరకలు కూడా పోవు. అలాంటప్పుడు వాటిమీద కాస్త ఉప్పు వేసి నిమ్మ చెక్కతో పాత్రను రబ్ చేసి మరొకసారి కడిగితే మంచి ఫలితం ఉంటుంది.


దుస్తులపై పడిన బురద మరకలు పోవాలంటే... బంగాళ దుంపలు ఉడకబెట్టిన నీటిలో నానబెట్టి ఉతకాలి.


పచ్చి క్యారెట్‌ను రోజూ తింటే రోజంతా శరీరానికి కావల్సిన విటమిన్లు లభిస్తాయి. కళ్లు..
చర్మం , శరీర కణజాలాన్ని క్యారెట్‌లో సమృద్ధిగా ఉండే విటమిన్‌ ఎ ఆరోగ్యంగా ఉం చుతుంది.
- విటమిన్‌ సి, విటమిన్‌ ఇ ఎక్కువగా ఉండే ఆకుకూరలను ప్రతిరోజు తీసుకోవడంతో చర్మం మృదువుగా ఉంటుంది.
- విటమిన్‌ సి అధికంగా ఉండే సిట్రస్‌ జాతి పండ్లు (నిమ్మ, నారింజ) తినడంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.
- పెక్టిన్‌, కాల్షియం, పాస్ఫరస్‌, మెగ్నీషియం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం ఎంతో మంచిది.
- శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించి విషపదార్థాల స్థాయిని నియంత్రించే శక్తి యాపిల్‌కు ఉంటుంది.

వీటన్నింటీకన్నా ముఖ్యంగా ప్రతిరోజూ ఆరు నుంచి ఎనిమిది లీటర్ల నీటిని తాగాలి. డీహైడ్రేషన్‌ నుంచి రక్షించడమే కాకుండా చర్మకణాల్లోని మలినాలను తొలగిస్తుంది. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది

No comments :

Post a Comment