Sunday, March 24, 2013

శనగపప్పు బఠాణీల కూర




కావలసినవి

పచ్చిశనగపప్పు - 1/4 గ్లాస్ 
పచ్చిబఠాణీలు - 1/4గ్లాస్ 
అల్లం - చిన్న ముక్క
ఉల్లిపాయ - 1
టమాటో - 1
పచ్చిమిర్చి - 1 చెంచా

నిమ్మకాయ -1  
నూనె -సరిపడ
పోపు గింజలు - 1 చెంచా
కొత్తిమీర - కొంచెం
కొబ్బరి తురుము - 2 
చెంచాలు
ఉప్పు - సరిపడ
కారం - 1 
చెంచా


చేసే విదానం

ముందుగా పచ్చిశనగపప్పు ను,పచ్చిబఠాణీలు ను కుక్కర్ లేక విడిగ ఉడకపెట్టుకొవలి.
బాండి లొ  నూనె వేసి పోపు గింజలు(మినపప్పు,ఆవాలు,ఇంగువ) వేసి తరుగుకున్న ఉల్లిపాయ, టమాటో ముక్కలు,అల్లం పచ్చిమిర్చి ముక్కలు (లేక) అల్లం పచ్చిమిర్చి ముద్ద  వేసి బాగా  కలిపి ఉడికించుకున్న పచ్చి శనగపప్పు,బఠాణీలు వేసి,ఉప్పు,కారం,కొద్దిగ పంచదార వేసి  బాగా  కలిపి మిక్సి వేసుకున్న కొబ్బరి ని కూడ వేసి బాగ కలిపి చివర్లో నిమ్మరసం పిండి, పైన కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడి వేడి శనగపప్పు బఠాణీల కూర తయారు. 

ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలు, రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

No comments :

Post a Comment