Wednesday, August 28, 2013

బిర్యానీ




కావలిసినవి

బియ్యం :2 కప్పులు 
బంగాళదుంపలు -2
పచ్చిబఠాణీ -5 కాయలు
ఉల్లిపాయలు-4
క్యారట్ -2
టొమాటో -3
క్యాప్సికం-1
మీల్ మేకర్-15
దొండకాయ-1
పుదినా-1  కట్ట
కరివేపాకు-తగినంత
నూనె -తగినంత
ఉప్పు-తగినంత
అల్లం-తగినంత
వెల్లుల్లి -తగినంత
ఏలకులు -1
దాల్చినచెక్క - చిన్న ముక్క,
లవంగాలు-2
గరంమసాలాపొడి--తగినంత
గసగసాలు --తగినంత
షాజిరా--తగినంత
మసాల ఆకు-3 ఆకులు
జాజి కాయ ముక్క-చిన్నది

చేసే విదానం

బంగాళదుంపలు,ఉల్లిపాయలు,క్యారట్,టొమాటో,క్యాప్సికం,దొండకాయ ఈ కూరలు అన్ని తరుగుకోవాలి
పచ్చిబఠాణీ ,పుదినా లను వొల్చుకోవాలి.
పాన్  పెట్టి నూనె వేసి,కాగిన తరువాత,దాల్చినచెక్క ముక్క,లవంగం,ఏలకులను దంచినది వేసి,మసాల ఆకులు వేసి ఒకసారి కలిపి,అల్లం,వెల్లుల్లి పెస్ట్ చేసుకున్నది వేసి,కరివేపాకు  పెస్ట్ చేసుకున్నది వేసి,ఒక ఉల్లిపాయను  పెస్ట్ చేసుకున్నది వేసి,తరిగి పెట్టుకున్న  కూర ముక్కలు,మీల్ మేకర్, పచ్చిబఠాణీ వేసి బాగ కలిపి కొద్దిగ నీళ్ళు పొసి ఉడకనివ్వాలి.
మిక్సి జార్ లో గసగసాలు,దాల్చినచెక్క,షాజిరా,జాజి కాయ ముక్క వేసి  మిక్సి  వేసి, కొద్దిగ నీళ్ళు పొసి మిక్సి  వేసి,పాన్ లొ పోసి ,ఒకసారి కలిపి,పుదినా ను, వేసి కలిపి ,ఉప్పు  వేసి కలిపి,తడిపి బియ్యము ను వేసి బాగ కలిపి(2 కప్పు బియ్యానికి  3 కప్పులు నీళ్ళు పొయాలి),నీళ్ళు పొసి కుక్కర్ మూత పెట్టి 2 whistles రానించి... చల్లారకా మూత తిసి మగ్గనించి తినడమే...అంతే బిర్యాని రేడి



No comments :

Post a Comment