కజ్జి కాయలు
కావలిసినవి
మైదా పిండి --- 1 కప్పు
సొడా ఉప్పు --- చిటెకెడు
ఉప్పు --- చిటెకెడు
చక్కెర --- 3/4 th కప్పు
ఎండు కొబ్బరి --- 1 కప్పు
పుట్నాలు ---- 1 కప్పు
నూనె --- తగినంత
యాలకుల పొడి --- కొద్దిగా
చేసే విదానం
మైదా పిండి లో చిటెకెడు సొడా ఉప్పు, చిటెకెడు ఉప్పు వేసి కలిపి ,వేడి వేడి నూనె వేసి కలిపి, తగినంతనీళ్ళు వేసి చపాతీ ముద్ద లా చేసుకోవాలి...అర గంట నాన నివ్వాలి.
పుట్నా ల ను మిక్సి వేసుకొని పక్కన పెట్టుకొవాలి
ఎండు కొబ్బరి ని కూడ మిక్సి వేసుకొని పక్కన పెట్టుకొవాలి
చక్కెర ని కూడ మిక్సి వేసుకొని పక్కన పెట్టుకొవాలి
ఇప్పుడు మూడు కలిపి మిక్సి వేసి,యాలకుల పొడి వేసి బాగ కలిపి పక్కన పెట్టుకొవాలి
మైదా పిండిని చిన్న చిన్న వుండలు చేసుకొవాలి...వుండల ను చిన్న చిన్న పూరీ లా ఒత్తుకొని ,పిండి మిశ్రమాని మధ్య లో పెట్టి,పూరి చివరన నీళ్ళు కాని నూనే కాని రాసి పూరిని మడిచి చేతి తొ వత్తి పక్కన పెట్టుకొవలను...అన్ని వుండలను ఇలాచేసుకొని నూనే లో కాల్చడమే...అంతే కజ్జి కాయలు సిద్దం...:)
No comments :
Post a Comment