Friday, September 13, 2013

బూంది లడ్డు

సేమ్యా లడ్డూ

గోధుమల లడ్డు

తొక్కుడు లడ్డు లేక సాదాలడ్డు లేక బందరు లడ్డు

రవ్వ లడ్డు

నువ్వుల లడ్డు

నువ్వుల ఉండలు

బేసన్ లడ్డు

క్యారట్ రవ్వ లడ్డు

రాగి లడ్డు

 పెసర పప్పు లడ్డు

కజ్జి కాయ ల పొడి లడ్డు

డ్రైఫ్రూట్స్ లడ్డు

కొబ్బరి లడ్డు

పాల తో కొబ్బరి లడ్డు

కేరట్ కోవా లడ్డు

ఖర్జూర లడ్డు

బ్రెడ్ చూర్మా లడ్డూ

పుట్నాల పప్పు లడ్డూ

సున్నుండలు

మినపప్పు వుండలు

పోక ఉండలు

మరమరాల ఉండలు

సగ్గు బియ్యం లడ్డు

అటుకుల లడ్డు

అటుకుల కొబ్బరి లడ్డు


సేమ్యా లడ్డూ

కావలిసినవి

సేమ్యా –1 గ్లాస్

చక్కెర –3/4 గ్లాస్

నెయ్యి –కొద్దిగా

యాలకులు – కొద్దిగా

చేసేవిదానం 

పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి సేమ్యా ను బంగారు రంగు  వచ్చేవరకు చిన్నమంటపై నిదానంగా వేయించుకొవాలి.
 చల్లారాక మిక్సీలో పొడి చేయాలి.
అలాగే చక్కెర ను, యాలకులు ను కూడ  మెత్తగా పొడి చేయాలి.
ఇప్పుడు మూడిటి ని కలిపి ఒకసారి మిక్సి వేసి,నెయ్యి వేస్తు వుండాలు కట్టుకొవాలి.అంతే సేమ్యా లడ్డు తయారు.
ఈ లడ్డులో కావాలంటే జీడిపప్పు,బాదాం,కిస్ మిస్ కూడా వేసుకోవచ్చు


గోధుమల లడ్డు


ఎర్రగోధుమలు శుభ్రంచేసి బూరెల మూకుడులో వేసి దోరగా వేయించాలి. ఈ గోధుమలను తిరగలిలో విసరాలి. పిండి మరీ మెత్తగా కాకుండా, మరీ రవ్వగా కాకుండా మధ్యస్తంగా ఉండాలి.
చక్కెర తిరగలిలో పోసి మెత్తగా విసురుకోవాలి.
ఏలకులు పొడి చేసుకొని, ఎండుద్రాక్షలు ఈ గోధుమపిండి, చక్క్రెరపొడితో బాగా కలిపాలి.
ఈ మిశ్రమంలో రెండు చెంచాల పాలు గాని, నెయ్యి గాని వేసి కలిపితే చక్కగా ముద్దలాగా అవుతుంది.
దీనితో కావలసినంత పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి.


nenu idi try cheya ledu ...

తొక్కుడు లడ్డు

కావలసిన వస్తువులు:

శనగపిండి - 1/2 కిలో
పంచదార - 2 గిద్దలు
డాల్డా - 1/2 గిద్ద
షోడా ఉప్పు - చిటికెడు
నూనె - వేయించడానికి సరిపడినంత.
యాలుకల పొడి - పావు స్పూన్.
జీడి పప్పు (కాజు) - సరిపడినన్ని.

తయారు చేసే విధానం:

శనగపిండిలో షోడా ఉప్పు, కొంచెం నూనె, నీళ్ళు పోసి చక్రాల పిండిలా కలపాలి, తరువాత వాటిని చక్రాలులా వండాలి. అవి లేత రంగులో ఉండేలా చూడాలి. వీటిని తరువాత మిక్సీలో వేసి మెత్తగా పిండిలా చేసుకోవాలి. తరువాత ఒక డబ్బా పంచదారలో కొద్దిగా నీరు పోసి తీగపాకం వచ్చిన తరువాత ఈ పిండి పోసి కలపెట్టాలి. డాల్డా, యాలుకల పొడివేసి బాగా కలపాలి. చేతికి నెయ్యి రాసుకొని ముద్దలు చెయ్యాలి. ఒకొక్క లడ్డు మీద ఒకొక్క జీడిపప్పు అంటిస్తే బాగుంటుంది.


nneu idi try cheya ledu ...

రవ్వ లడ్డు





నువ్వుల లడ్డు


కావలసిన వస్తువులు:

నువ్వులు - 1 కిలో.
పల్లీలు - 100 గ్రా.
యాలుకల పొడి - 1 టీ స్పూను.
బెల్లం - 1 కిలో.
జీడిపప్పు - 100 గ్రా.
నెయ్యి - 100 గ్రా.

తయారు చేసే విధానం:

ముందుగా నువ్వులు, పల్లీలు, జీడీపప్పులను విడివిడీగా కడాయిలో ఆయిల్ లేకుండా దోరగా వేయించి పెట్టుకోవాలి. నువ్వులను రోట్లో వేసి దంచాలి. మధ్యలో బెల్లం, పల్లీలు, జీడీపప్పు వేసి మిశ్రమాన్ని దంచాలి. యాలకుల పొడి, నెయ్యి వేసి చక్కగా కలిపి కావల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి.

nneu idi try cheya ledu ...

బేసన్ లడ్డు


కావలసిన వస్తువులు:

శనగపిండి - 600 గ్రా.
నెయ్యి - 500 గ్రా.
పంచదార - 300 గ్రా.
యాలుకలపొడి - 10 గ్రా.

తయారు చేసే విధానం:

శనగపిండి, నెయ్యి మిశ్రమాన్ని చక్కగా కలిపి సన్నటి సెగపై దోరగా వేయించి పెట్టుకోవాలి. గిన్నెలో పంచదారకు సరిపడినన్ని నీళ్ళు పోసి ముదురు పాకం పెట్టుకోవాలి. యాలకుల పొడివేసి కలిపి చల్లార్చిన తర్వాత పంచదార పాకం పొడి అయ్యేదాకా కలపాలి. శనగపిండి మిశ్రమాన్ని వేసి కలిపి కావల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి.

రాగి లడ్డు


కావలసిన పదార్ధాలు:
రాగిపిండి: 1cup
బెల్లం తురుము: 1cup
పల్లీలు: 1cup
నెయ్యి: 1cup
జీడిపప్పు: 8
నువ్వులు: 1cup
బాదం పప్పు: 1/2cup
యాలకల పొడి: 1tsp
ద్రాక్ష: 8

తయారు చేయు విధానము:
1. మొదటగా స్టౌవ్ పై కడాయి పెట్టి అందులో విడివిడిగా పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు, రాగి పిండి వేయించి పెట్టుకోవాలి.
2. మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకొన్న పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
3. ఈ తర్వాత ఈ మిశ్రమానికి పైన వేయించి పెట్టుకున్న రాగిపిండి కలిపి, దాంతో పాటు ఒక కప్పు బెల్లం తురుము, ఒక కప్పు నెయ్యి, యాలకల పొడి వేసి బాగా కలిపి లడ్డుగా చేసుకుని పైన జీడిపప్పు, ద్రాక్షతో గార్నిష్ గా అలంకరిస్తే రాగి లడ్డు రెడీ. (రాగి పిండి మరీ పొడిగా ఉంటే కొద్దిగా పాలు కలిపి లడ్డులా చేసుకోవచ్చు)

nneu idi try cheya ledu ...

 పెసర పప్పు లడ్డు





కావలసిన పదార్ధాలు

పెసర పప్పు--1 /2 కప్
పంచదార- 1/4  కప్
నెయ్యి- 1/4  కప్ లో సగం
ఎలాచి -3


చేసే విదానం

 ముందు గా పెసరపప్పు ను బాండి లో వేసి వేయించాలి.మరీ ఎర్రగా కాకుండా కొంచెం గా వేయించాలి.

 పంచదార,ఎలాచి లను మిక్సిలో వేసి బరకగా పొడి చేసుకోవాలి.
 పెసరపప్పు ను కూడా మిక్సి లో వేసి బరక గా పొడి చేయాలి.

 పంచదార పొడి,పెసర పొడి మరలా మిక్సి వేసి ,అందులో నెయ్యి (లేక) పాలు(కాచిన పాలు కొద్దిగా) పొసి  వేసి లడ్డు లాగా చుట్టాలి. అంతే తియ్య తియ్యని  పెసర పప్పులడ్డు రెడీ...

గమనిక: పైన వున్న ఫొటొ లో రెండు లడ్డు లా గ వున్నవి నెయ్యి తో చేసినవి ...మూడు లడ్డు లా గ వున్నవి పాలతో చేసినవి...

కజ్జి కాయ ల పొడి లడ్డు


కజ్జి కాయ ల పొడి లడ్డు చెయ్య లేదు కాని తిన్నా...కజ్జి కాయ ల పొడి ని పాల తొ లడ్డు గా చెయ్యడమే


డ్రైఫ్రూట్స్ లడ్డు


జీడిపప్పు--- ఒక కప్పు
బాదంపప్పు-- ఒక కప్పు
పిస్తా పప్పు--- ఒక కప్పు
ఖర్జూరాలు--- 250 గ్రాములు
గసగసాలు--- 50 గ్రాములు
నెయ్యి------ 100 గ్రాములు
పంచదార---- 100 గ్రాములు
ఏలకులు---- 4
తయారు చేసే విధానం

ముందుగా జీడి పప్పు , బాదం పప్పు, పిస్తా పప్పు చిన్న ముక్కలుగా చేసుకుని, భాండీ లో నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టుకొని గస గసాల్ని భాండీలో దోరగా వేయించుకాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పావు లీటరు నీళ్ళు తీసుకుని పొయ్యి మీద పెట్టి అవి మరిగించాలి. అవి మరుగుతున్నప్పుడు 100 గ్రాముల పంచదార కలిపి నీళ్ళ పాకం పట్టాలి. ఇప్పుడు ఆ పాకంలో పావు కిలో ఖర్జూరాలు కలిపి పొయ్యిమీద ఉంచే బాగా కలిపి అవి మెత్తగా అయ్యేదాకా ఉంచాలి. అడుగు అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నె దించి ఆ మిశ్రమానికి 4 ఏలకుల పొడి సువాసన కోసం కలుపుకోవాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇంతకు మునుపు వేయించి పెట్టుకున్న పప్పుల్ని,గసగసాల్ని కలిపి వాటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తినడానికి రెడీ...............!

nneu idi try cheya ledu ...

కొబ్బరి లడ్డు


కావాల్సిన పదార్ధాలు:

కొబ్బరికాయ - ఒకటి
బెల్లం- పావు కేజి
యాలకులు- నాలుగు
నెయ్యి - 50 గ్రా
తయారు చేసే విధానం:

1) ముందుగా కొబ్బరి కాయను కొట్టి తురుముకోవాలి. తరువాత బెల్లాన్ని కూడా మెత్తగా తరుగుకోవాలి.
2) ఇప్పుడు తరిగినబెల్లాన్ని,తురిమిన కొబ్బరిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా వున్నగిన్నె పెట్టి అందులో కలిపి వుంచుకున్న కొబ్బరి,బెల్లం మిశ్రమాన్ని వేసి కొంచెం నీళ్లు జల్లుతూ అడుగంటకుండా తిప్పుతూ వుండాలి.ఇలా నీళ్లన్నీ పోయేవరకు కలిపి గట్టిపడ్డాక కొంచెం నెయ్యి వేసి తిప్పుతూ యాలకుల పొడి కూడా వేసుకోవాలి..
3) ఇలా ఉడికిన కొబ్బరి మిశ్రమాన్ని స్టవ్ మీదనుండి దించి చేతికి నెయ్యి రాసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలు గా చుట్టుకోవాలి..అంతే తీయని కొబ్బరి లడ్డు రెడీ...


nneu idi try cheya ledu ...

పాల తో కొబ్బరి లడ్డు



కావలిసినవి

చిక్కటి పాలు -1 కప్పు ,
చక్కర -3/4 కప్పు ,
పచ్చి కొబ్బరి కోరు -1 కప్పు ,
యాలకులు -5

చేసే విదానం

స్టవ్ వెలిగించి మందంగా ఉన్న బాణలి పెట్టి పాలు,పచ్చి కొబ్బరి కోరు,చక్కర వేసి కలిపి సన్నని సెగ మీద చిక్కబడేవరకు తిప్పాలి.



రంగు మారి గట్టిపడుతున్నప్పుడు యాలకుల పొడి  వేసి ,బాగ కలిపి,

నెయ్యి రాసిన ప్లేట్ లో వేసుకోవాలి .

కొంచెం చల్లారాకా ఉండలు కట్టుకోవాలి .ముక్కలుగా కూడా కోసుకోవచ్చు .


కేరట్ కోవా లడ్డు

కేరట్ కోవా లడ్డు కావలసినవి
 కోవా పావు కేజీ
కేరట్ 2
కొబ్బరి సగం చిప్ప
 పంచదార 1/2 కప్పు
 నెయ్యి 4 స్పూన్స్
 జీడిపప్పు
 బాదంపప్పు
 కిస్మిస్
 ఏలకులు
 తయారుచేయువిధానం ముందుగా కేరట్,కొబ్బరి తురుము కోవాలి స్టవ్ , మీద బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసిజీడిపప్పు,బాదంపప్పు,కిస్మిస్ వేయించి  కేరట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి దీనికి కొబ్బరితురుము పంచదార కలిపి దగ్గరయ్యే వరకు తిప్పుతూ ఉండాలి .జీడిపప్పు,బాదంపప్పు,కిస్మిస్ ఏలకులపొడి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కోవా చిన్న ఉండ తీసుకుని చేతిలో పరుచుకుని మద్యలో కేరట్ ఉండపెట్టి కప్పెయ్యాలి అన్ని ఆలాచేసుకుంటే కేరట్  కోవా లడ్డు రెడి

nneu idi try cheya ledu ...

ఖర్జూర లడ్డు


కావలసిన పదార్థాలు:
ఖర్జూర - ఒక కేజీ, వేరుశనగపప్పు - 400గ్రా, జీడిపప్పు - 200గ్రా, బెల్లం - 800గ్రా, కొబ్బరి తురుము - 300గ్రా, నువ్వులు - 100గ్రా, గసగసాలు - 200గ్రా, నెయ్యి -200గ్రా, కిస్‌మిస్ - 200గ్రా, యాలకుల పొడి - రెండు టీ స్పూన్‌లు.

తయారుచేయు విధానం:
ముందుగా ఖర్జూరలను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక పాత్రలో నూనె వే సి కాస్త వేడి అయ్యాక జీడిపప్పు, వేరుశనగపప్పు వేసుకోవాలి. వీటిని కాసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత గసగసాలు, కిస్‌మిస్, కొబ్బరి తురుము, నువ్వులు ఒకదాని తరువాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలి.

ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, వేరుశనగపప్పును కూడా కలుపుకోవాలి. చివరగా ఖర్జూర ముక్కలను వేసుకోవాలి. మరొక పాత్రలో బెల్లంను ముదురు పాకం పట్టి యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలు కట్టుకోవాలి. అంతే.. ఖర్జూర లడ్డూ రెడీ.

nneu idi try cheya ledu ...

బ్రెడ్ చూర్మా లడ్డూ


కావలసిన వస్తువులు:

బ్రెడ్ టోస్ట్  – 8

పంచదార – 1/2 కప్పు

నెయ్యి – 1/4 కప్పు

యాలకుల పొడి – 1 tsp



బ్రెడ్ టోస్టులను మిక్సీలో వేసి మెత్తగా లేదా రవ్వలా పొడి చేసుకోవాలి. ప్యాన్‌లో రెండు చెంచాల నెయ్యి వేడి చేసి ఈ పొడిని కొద్ది సేపు వేయించాలి. ఈ పొడిలో పంచదార పొడి చేసి కలపాలి. తర్వాత యాలకుల పొడి కలిపి కరిగించిన నెయ్యి వేసి కలుపుతూ కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి. టోస్టులు అందుబాటులో లేకుంటే బ్రెడ్ స్లైసులను టోస్టర్ లో కాల్చుకోవాలి. లేదా ప్యాన్ లో గట్టిపడేవరకు కాల్చుకోవాలి..


nneu idi try cheya ledu ...

పుట్నాల పప్పు లడ్డూ


కావలసిన వస్తువులు:

పుట్నాల పప్పు  – 250 gms

చక్కెర – 200 gms

యాలకుల పొడి – 1 tsp

నెయ్యి – 100 gms

పుట్నాలపప్పును శుభ్రం చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే పంచదార, యాలకులు కలిపి పొడి చేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో ఈ పప్పుల పొడి, పంచదారపొడి వేసి బాగా కలియబెట్టి కరిగించిన నెయ్యి వేసి కలిపి లడ్డూలలాగా కట్టుకోవాలి. కావాలంటే సన్నగా కట్ చేసిన డ్రైఫ్రూట్స్ వేసుకోవచ్చు. అరగంట ఆరనిచ్చి డబ్బాలో పెట్టుకుంటే సరి. నోట్లో  వేసుకుంటే కరిగిపోయే లడ్డూలు రెడీ..


nneu idi try cheya ledu ...

సున్నుండలు










మినపప్పు వుండలు













పోక ఉండలు


పోక ఉండలు లేదా పోకుండలు అనేది గుండ్రంగా ఉండే వంటకం. రసగుల్లా మాదిరిగా కనిపిస్తూ గట్టిగా ఉండే వంటకం. బియ్యపు పిండికి బెల్లపుపాకము చేర్చుట ద్వారా చలిమిడి అను ఒక రకమైన మిఠాయి తయారగును. ఈ చలిమిడి అని మిశ్రమమునకు వారి వారి ఇష్టాలననుసరించి నువ్వుపప్పు, బాధంపప్పు, జీడిపప్పు లాంటివి చేర్చుకొని దీనిని గుండ్రంగా చిన్నగా కావలసినచో చిన్నగా పెద్దగా కావలసినచో పెద్దగా గుండ్రటి ఆకారంలో చేసి మరిగే నూనెలో ముదురుగా ఎరుపునలుపుల మధ్యస్తమిశ్రమ రంగులో వేగిస్తారు. నూనె ఆరిన తరువాత గట్టీగా తీయగా ఏర్పడే మిఠాయిలను పోకుండలు అని పిలుస్తారు. ఇవి ఆంధ్రదేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి.

 మరమరాల ఉండలు


కావలసిన పదార్ధాలు

               మరమరాలు : ఒక కప్పు
               బెల్లం: ఒక కప్పు

తయారు చేయు విధానము:
           బెల్లంను ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి బాగా ఉండపాకం అయ్యేలాగా చేయాలి,,,
           (కొంచెం పాకం స్పూన్ లో తీసుకొని నీళ్ళల్లో వేస్తె గట్టిగ అవుతుంది,,),
           అలా ఉండపాకం అవ్వగానే stove ఆపేసి మరమరాలు వేసి బాగా కలపాలి.
           కొంచం వేడి గా ఉండగానే చిన్న చిన్న ఉండలు గా చేసుకుంటే.,,బాగా చల్లారాక గట్టిగా అవుతుంది...
           తియ్య తియ్య గ ఉండే మరమరాల ఉండలు రెడీ...

సగ్గు బియ్యం లడ్డు



కావలిసినవి

సగ్గు బియ్యం –1/2  గ్లాస్

చక్కెర –1/4 గ్లాస్

నెయ్యి –కొద్దిగా

యాలకులు – కొద్దిగా

చేసేవిదానం 

పాన్ లో సగ్గు బియ్యం ను  వేసి  బంగారు రంగు  వచ్చేవరకు చిన్నమంటపై నిదానంగా వేయించుకొవాలి.
 చల్లారాక మిక్సీలో పొడి చేయాలి.
అలాగే చక్కెర ను, యాలకులు ను కూడ  మెత్తగా పొడి చేయాలి.
ఇప్పుడు మూడిటి ని కలిపి ఒకసారి మిక్సి వేసి,నెయ్యి వేస్తు వుండాలు కట్టుకొవాలి.అంతే సగ్గు బియ్యం లడ్డు తయారు.



అటుకుల లడ్డు




కావలసిన పదార్థాలు

అటుకులు : 2 కప్పులు

యాలకులు : కొద్దిగా
నెయ్యి : కొద్దిగా
పంచదార:1/4 కప్పు

చేసే విదానం

అటుకులను దోరగా వేయించి... 
 వేయించిన  అటుకులను పొడి చేసుకోవాలి. 
పంచదారను కూడ పొడి చేసుకోవాలి
అటుకుల పొడి,  పంచదార పొడి, యాలకుల పొడి బాగా కలపాలి
కరిగిన నెయ్యి వేస్తు ,కలుపుతు చిన్న చిన్న లడ్డులు చేసుకోవాలి.అంతే అటుకుల లడ్డులు సిద్దం... 


ఇవి చాలా రుచిగా వుంటాయి.



అటుకుల కొబ్బరి లడ్డు


కావలసిన పదార్థాలు: అటుకులు: 2cups పచ్చికొబ్బరి తురుము: 1 cup యాలకులు: 1tsp బెల్లం: 2 cups కిస్‌ మిస్: 2tsp పాలు: 1/2 cup జీడిపప్పు: 1 tsp నెయ్యి: వేయించడానికి సరిపడ

తయారు చేయు విధానం:

 1. ముందుగా అటుకులను శుభ్రంగా ఏరి వాటిని మిక్సీలో వేసి కాస్త గరుకుగా పట్టుకోవాలి. 2. తర్వాత కొబ్బరిని, బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. 3. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీడిపప్పు, కిస్‌ మిస్‌లను దోరగా వేయించాలి. 4. తర్వాత పాలను గిన్నెలో పోసి వేడిచేసి అందులో తురిమిపెట్టుకున్న బెల్లాన్ని వేసి కలపాలి. 5. బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉంచి తర్వాత పాలను, కొబ్బరి తురుమును అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలిపి వేడిగా ఉన్న సమయంలోనే లడ్డూలు చుట్టాలి. 6. చివరగా వీటిపై మెల్లగా జీడిపప్పు, కిస్‌ మిస్‌లను అద్దాలి. అంతే అటుకుల కొబ్బరి లడ్డు రెడీ.


nneu idi try cheya ledu ...










No comments :

Post a Comment