రాగి-సెమోలిన దోసె
పదార్థాలు: రాగిపిండి: 1cup సెమోలిన : 1cup(రవ్వలాంటింది ఇది బయటమార్కెట్లో దొరుకుతుంది) మైదా: 1/2cup బియ్యం పిండి: 1/2cup బట్టర్ మిల్క్: 1cup నీళ్ళు : సరిపడా ఉప్పు : రుచికి సరిపడా పచ్చిమిర్చి: 2 సన్నగా కట్ చేసుకోవాలి జీలకర్ర: 1tsp కొత్తిమీర తరుగు: 2tbsp కరివేపాకు: రెండు రెమ్మలు నూనె: సరిపడా
తయారు చేయు విధానం: 1. ముందుగా ఒక పెద్దగిన్నె తీసుకొని అందులో పైన ఇచ్చిన పదార్థాలన్ని (నూనె తప్ప)వేయాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి, దోసెపిండిలా చిక్కగా కలుపుకోవాలి. 2. తర్వాత స్టౌ మీద తవా లేదా పాన్ పెట్టి వేడి చేయాలి.(కొద్దిగా నీళ్ళు తవా మీద చిలకరిస్తే తావా బాగా వేడి అయ్యిండేది లేనిది తెలుస్తుంది). ఇప్పుడు మంట తగ్గించి, కొద్దిగా నూనె రాసి రాగిపిండి మిశ్రమాన్ని దోసెలా పోయాలి. తవా మొత్తం గరిటతో అలాగే సర్ధాలి. మద్యమద్య గ్యాప్ ఉంటే అక్కడ కూడా పిండిపోయాలి. కానీ గరిటగో రుద్దకూడదు. పై పైనే పిండిపోసి అలాగే వదిలేయాలి. 3. ఇప్పడు దోసె మీద నూనె చిలకరించాలి. దోసె చివర్లో చుట్టు కొద్దిగా నూనె వదలాలి. 4. ఇప్పుడు మీడియంగా మంట పెట్టి, రెండు మూడు నిముషాలు దోసె ఉడకనివ్వాలి/ కాలనివ్వాలి. మీకు దోసె లైట్ గా స్మూత్ గా కాలితే చాలనుకొటే రెండు మూడు నిముషాల తర్వాత తవానుండి సర్వింగ్ ప్లేట్లోనికి మార్చుకోవాలి.క్రిస్పిదోసె కోరుకొనే వాళ్ళు. మంట పెంచి దోసెను బాగా కాలనివ్వాలి. 5. అంతే దోసె రెడీ. దీన్ని సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని సాంబార్ లేదా ఉల్లిటమోటో చట్నీ లేదా పప్పుల పొడితో సర్వ్ చేయాలి. అంతే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి రెడీ.

No comments :
Post a Comment