పాలక్ ఫ్రైడ్ రైస్
కావలసినవి: బాస్మతి బియ్యం - 250 గ్రా./ ఒక గ్లాస్, పాలక్ ప్యూరీ (పాలకూరను ఉడికించి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి) - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (నిలువు ముక్కలుగా కట్ చేసుకోవాలి), క్యారెట్ - 1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చి బఠానీ గింజలు - అర కప్పు, పచ్చి మిర్చి - 3 (కట్ చేసుకోవాలి, మిరియాల పొడి - అర టీ స్పూన్, సోయాసాస్ - అర టేబుల్‌స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టీ స్పూన్లు
తయారి: గిన్నెలో నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, క్యారట్, పచ్చిమిర్చి, బఠానీలు... ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగనివ్వాలి. తర్వాత పాలక్ ప్యూరీ, ఉప్పు, మిరియాలపొడి, సోయాసాస్ వేసి కొన్ని నిమిషాలు ఉడికించి, ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి మరగనివ్వాలి. త ర్వాత బియ్యం పోసి ఉడకనివ్వాలి. అన్నం పూర్తయ్యాక దించి రైతాతో వేడి వేడిగా వడ్డించాలి. (అన్నం విడిగా వండి, నీళ్లు పోయకుండా ఉడికిన పాలక్ ప్యూరీ మిశ్రమంలో వేసి, కలిపి కూడా పాలక్ ఫ్రైడ్ రైస్‌ను తయారుచేసుకోవచ్చు)

No comments :
Post a Comment