Tuesday, October 15, 2013

వేరుసెనగపప్పు చిక్కి


కావలసినవి
వేరుసెనగపప్పు లేదా పల్లీలు - అర కిలో
బెల్లం - అర కిలో ( తరుగుకోవాలి )
చేసే విదానం
ముందుగా గ్యాసు మీద ఒక బాణీ పెట్టి వేరుసెనగపప్పుని దోరగా వేయించుకోవాలి. చల్లారాక పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు ఒక బాణీ కానీ మందంగా ఉన్న గిన్నె గాని తీసుకొని అందులో తరిగిన బెల్లం వేసి బెల్లం మునిగేదాక నీరు పోసి గ్యాస్ మీద పెట్టి ముదురు పాకం పట్టుకోవాలి.
ఒక ప్లేట్ లో కొంచెం నీరు పోసి బెల్లం పాకం అవుతుండగా కొంచెం తీసి నీళ్ళలో వేసి అది ఉండ అవుతుంటే ముదురు పాకం వచ్చినట్టే. పాకం వచ్చాక అందులో వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఒక కంచం కాని ప్లేట్ గాని తీసుకొని గిన్నెలో ఉన్న మిశ్రమాన్ని ప్లేట్ లోకి పోసి ప్లేట్ అంతా సమానంగా పరచాలి. చల్లారాక ముక్కలుగా కట్ చేసి డబ్బాలో పెట్టుకోవాలి.

No comments :

Post a Comment