Thursday, February 20, 2014

 బుంగమిరపకయ(క్యాప్సికమ్),కొబ్బరి పచ్చడి



కావలిసినవి

క్యాప్సికమ్ -1 కాయ

ఎండు మిరపాకాయలు-2

పచ్చి మిరపాకాయలు-2

చింత పండు-కొద్దిగా

ఉప్పు-కొద్దిగా

 పచ్చి కొబ్బరి -1/4 చిప్ప

ఆవాలు-1/4 చెంచా

మినపప్పు-1/4 చెంచా

ధనియాలు-1/4 చెంచా

ఇంగువ-కొద్దిగా

మెంతులు-4

పచ్చి శనగపప్పు--1/4 చెంచా

నూనె-తగినంత


చేసే విదానం


1)క్యాప్సికమ్,పచ్చి కొబ్బరి  ని చిన్న చిన్న ముక్కలు గా చేసు కోవాలి

2)పాన్ లొ నూనె  వేసి కాగాకా,ఆవాలు,మినపప్పు,ధనియాలు,ఇంగువ,మెంతులు,ఎండు మిరపాకాయలు,పచ్చి మిరపాకాయలు, క్యాప్సికమ్ ముక్కలు కూడ వేసి,వేయించి పక్కన పెట్టుకోవాలి.దీనిలొనే చింత పండు కూడ వెయ్యాలి

3)మిక్సి జార్ లొ అన్ని వేసి ,కొబ్బరి ముక్కలు కూడా వేసి,ఉప్పు వేసి మిక్సి వేసి, మరలా తిర్వవమాత( ఆవాలు,మినపప్పు,పచ్చి శనగపప్పు,ఎండు మిరపాకాయ ముక్క,ఇంగువ)పెట్టుకుంటే బావుంటుంది( ఈ తిర్వవమాత మీ ఇష్టం) ...అన్నం లోకి కలుపుకొని తినడమే...




No comments :

Post a Comment