Monday, March 24, 2014

ఊర మిరపాకాయలు


కావలిసినవి

పచ్చి మిరపాకాయలు
ఉప్పు
ఇంగువ
మజ్జిగ
మెంతి పిండి
వాము

చేసే విదానం

పచ్చి మిరపాకాయల ను శుభ్రము గా కడిగి మధ్యలో చీల్చుకొవలను.2nd ఫొటో లో లాగా... 

2


  

  
మజ్జిగ ను కొద్దిగ నీళ్ళగా చేసుకొవాలి.
వెడల్పాటి గిన్నే లో మజ్జిగ , ఉప్పు,ఇంగువ,మెంతిపిండి,వాము వేసి బాగ కలిపి,తరుగుకున్న/చీల్చు కున్న  పచ్చిమిర్చి ని వేసి, 12 గంటలు అంతే నాన నించి తరువాత పచ్చిమిర్చి ని పైకి కిందకి కలిపి ఇంకో  12 గంటలు నాన నివ్వాలి...
s-1 :మరసటి రోజు పచ్చిమిర్చి ని చిల్లుల పళ్ళేం లో వేసి,కింద మాములు పళ్ళేం పెట్టి కారిన మజ్జిగ అంతా వెడల్పాటి  మజ్జిగ  గిన్నే లో పోసి మూత పెట్టాలి ...
చిల్లుల పళ్ళేం లో వున్న పచ్చి మిర్చి ని గుడ్డ /కవర్ మీద వేసి ఎండ లో ఆర పెట్టవలను.
సాయంత్రం మరలా వెడల్పాటి  మజ్జిగ  గిన్నే లో వేసి నాన నివ్వాలి ... 

మరాలా s-1 చెయ్యాలి... మజ్జిగ అంతా పచ్చి మిర్చి పిల్చుకునేంత వరకు s-1 పద్దతి పాటించాలి ...
ఇలా చేస్తే కర కర లాడే ఊర మిరపాకాయలు సిద్దం అవుతాయి ...
డబ్బాలో దాచి పెట్టుకోని ఎప్పుడు కావలి అంటే అప్పుడు నూనే లో వేయించు కోని తినడమే  ...  





No comments :

Post a Comment