దిల్ సాహి
కావలిసినవి
మైదా-1/2 కప్పు
బొంబాయి రవ్వ-1/4(పావ్)కప్పు
నూనె-తగినంత
సొడా ఉప్పు-చాలా కొద్దిగా
నెయ్యి-2 చెంచాలు
పెరుగు-కొద్దిగా
పంచదార-1/2 కప్పు
చేసే విదానం
బొంబాయి రవ్వ ను కొద్దిగా నీళ్ళలో తడపాలి...
మైదా ను ఒక గిన్నే లో తీసుకొని,దానిలో సొడా ఉప్పు వేసి కలిపి,నెయ్యి వేసి కలిపి,నానిన బొంబాయి రవ్వ ను వేసి కలిపి,పెరుగు వేసి కలిపి ముద్ద లాగా చేసుకొవాలి..
ఆ ముద్దను ఒక 5ని"లు అట్లానే వుంచి,తరువాత ముద్దను ఒక్క సారి పిసికి,చపాతి వత్తే పీట మీద వేసి చపాతి కర్ర తో వత్తి (కొద్దిగ మందంగా వత్తుకోని),మనకి కావలిసిన ఆకారం లో కట్ చేసుకోని ,నూనె లో ఎర్రగా వేయించుకోని లేత పందార పాకం లో వేసి ఒక గంట అయిన తరువాత తినడమే...(దిల్ ఆకారం లో కట్ చేసాడు కాబట్టి దిల్ సాహి అని పేరు వచ్చింది..నేను గుండ్రగా కట్ చేసా)
లేత పందార పాకం
ఒక గిన్నే లొ పందార తీసుకొని,అది మునిగే అంత వరకు నీళ్ళు పొసి బాగా ఉడకనించి,చేతి తో తీసుకుంటే సాగుతు వుంటే అదే లేత పందార పాకం...


No comments :
Post a Comment