Thursday, October 16, 2014

సేమియా పులిహొర



కావలిసినవి

సేమియా-1 కప్పు
ఎండుమిరపకాయ ముక్కలు-3
ఉప్పు-రుచి కి సరిపడా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
శనగ పప్పు-కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
నూనె-కొద్దిగా
పచ్చిమిరపకాయలు-2
కరివేపాకు-కొద్దిగా
పసుపు-కొద్దిగా
నిమ్మకాయ రసం - రుచి కి తగినంత  లేక ఉడకపెట్టిన చింత పండు రసం-తగినంత

చేసే విదానం

ముందుగా  సేమియా ను నీళ్ళ లో ఉడికించి,చిల్లల పళ్ళేం లో వేసి చళ్ళ నీళ్ళు పొసి ఆర నివ్వ వలను...ఒక అర గంట...

బాండి తీసుకొని నూనె వేసి కాగిన తరువాత ఆవాలు,మినపప్పు,శనగ పప్పు, ఇంగువ,పచ్చిమిరపకాయలు ,  కరివేపాకు,పసుపు వేసి వేయించవలను.
సేమియా నీ ఒక వెడల్పాటి గిన్నేలో తీసుకోని,ఉప్పు వేసి కలిపి, తిర్వమాత వేసి,నిమ్మకాయ రసం వేసి కలిపి  తినడమే...





No comments :

Post a Comment