Friday, May 11, 2018

కొబ్బరి + బొంబాయి రవ్వ బర్ఫి

కావలిసినవి

కొబ్బరి తురుము - 1 గ్లాస్
బొంబాయి రవ్వ - 1/2 గ్లాస్
చక్కెర -- 1 గ్లాస్
నెయ్యి -1/4 గ్లాస్
పాలు - 1 గ్లాస్
యాలకుల పొడి -తగినంత

చేసే విదానం
వట్టి బాండి లో కొబ్బరి తురుము ను పచ్చివాసన పొయే అంత వరకు వేయించుకొవాలి ... పక్కన పెట్టుకొవాలి
అలాగే బొంబాయి రవ్వ ను ఎర్రగా వేయించుకొవాలి ...
చక్కెర మునిగే అంత వరకు పాలు పోసి ...ఒక్క ఉడుకు రానించి వేయించు కున్న కొబ్బరి తురుము ను,బొంబాయి రవ్వ ను వేసి బాగా కలిపి , నెయ్యి ,యాలకుల పొడి వేసి ఉడుక నించి తినడమే

కావలి అంటే జీడిపప్పు,బాదం,కిస్ మిస్ వేసుకొవచ్చు ...:)

No comments :

Post a Comment