Friday, August 30, 2019

బీసీ బేలే బాత్ /సాంబార్ అన్నం 



కావలిసినవి

బియ్యం ... 1 కప్పు
కంది పప్పు ... 1/2 కప్పు
చింత పండు నీళ్ళు ... సరిపడా /తగినంత  
ధనియాలు ... చెంచాలు
ఎండుమిరపకాయలు ...  6
మెంతులు  ...  చాలా  కొన్ని
పచ్చిశనగపప్పు ... 2 చెంచాలు
మినపప్పు ... 2 చెంచాలు
చెక్క ... 2 చిన్న ముక్కలు
లవంగం ... 4 
యాలకులు ... 2
షాజిరా పువ్వు ...   చాలా  కొద్దిగా 
తురుముకున్న పచ్చి కొబ్బిరి (లేక) ఎండు కొబ్బరి ...   కొద్దిగా 
కూరగాయ ముక్కలు ... కొన్ని(మీ ఇష్టము)
ఆవాలు  ... కొద్దిగా
ఇంగువ ... కొద్దిగా
పసుపు ... కొద్దిగా
జీడి పప్పు ... 4 
పల్లిలు ... కొన్ని
ఎండుమిరపకాయ ముక్కలు ... 3 
నెయ్యి-2 చెంచాలు 

చేసే విదానం

బాండి తీసుకొని పొయ్యి మీద పెట్టి కాగిన తరువాత ధనియాలు,ఎండుమిరపకాయలు,
మెంతులు ,పచ్చిశనగపప్పు ,మినపప్పు ,చెక్క ,లవంగం,యాలకులు,షాజిరా పువ్వు   
వేసి వేయించి తురుముకున్న పచ్చి కొబ్బిరి (లేక) ఎండు కొబ్బరి కూడా వేసి వేయించి  పక్కన పెట్టుకోని చల్లారాక మిక్సి లో మెత్తగా పోడి చేసుకోవాలి

బియ్యం,కంది పప్పు  కలిపి  3 cups  నీళ్ళు పోసి కుక్కర్ లో పెట్టి ,కూరగాయ ముక్కలు కూడ విడిగా పెట్టి  3 కూతలు రానించి పొయ్యి ఆపి వెయ్యాలి


పాన్ లో వుడికిన కూరగాయ ముక్కలు వేసి చింత పండు నీళ్ళు  పోసి మిక్సి లో మెత్తగా చేసుకున్న పోడి వేసి,ఉప్పువేసి,బాగా కలిపి వుడికించిన అన్నం కందిపప్పు వేసి బాగా కలిపి ఒక్క ఉడుకు రానించి ... పొయ్యి ఆపి వెయ్యాలి


బాండి తీసుకొని తిర్వమాత(నెయ్యి వేసి కాగిన తరువాత ఆవాలు,పసుపు ,ఎండుమిరపకాయ ముక్కలు , జీడి పప్పు ,పల్లిలు ,ఇంగువ, వేసి ) అన్నం లో కలపడమే 

ఊరమిరప కాయలు, వడియాలు ,అప్పడాలు వేసుకోని తింటే బావుంటుంది


కూరగాయ ముక్కలు


వంకాయలు,టొమాటో తరుగు,పచ్చిమిర్చి,ఉల్లి పాయలు, ఆలు ,బెండకాయ ,సొరకాయ,ములక్కాడ,చేమ దుంప,క్యారెట్‌, నచ్చినవి కొన్ని వేసుకోని చేసుకుంటే 
బావుంటుంది









No comments :

Post a Comment