Saturday, August 3, 2013

మడత కాజా

కావలిసినవి

మైదా -2 కప్స్
బేకింగ్ పౌడర్ (సొడా ఉప్పు ) -1 చెంచా
డాల్డా లేదా నెయ్యి - 7 చెంచాలు
చెక్కర -3 కప్స్
బియ్యప్పిండి -2 చెంచాలు
నీళ్ళు -11/2 కప్(పాకం కోసం)
నూనే - 3 కప్స్ (వేయించడానికి)

చేసే విదానం

మైదా,బేకింగ్ పౌడర్,డాల్డా లేదా నెయ్యి, నీళ్ళు(తగినంత)వేసి పూరీ పిండి లా కలుపుకొని,మూత పెట్టి 30 నిముషాలు నాన పెట్టాలి.
డాల్డా లేదా నెయ్యి,2 చెంచాలు బియ్యప్పిండి జారుగా కలుపుకోవాలి
తరువాత పిండి ని చిన్న చిన్న ఉండలు గా చేసుకోవాలి.
ఉండలు చేసుకున్న పిండి ని పుల్కా లాగా వత్తుకొవాలి.
తరువాత ఒక్కొక్క పుల్కా మధ్యలో డాల్డా లేదా నెయ్యి+బియ్యపిండి కలిపిన మిశ్రమం ను పూయాలి
ఇలా మిశ్రమం ను రాసిన మూడు పుల్కాలు ఒక దానిపై ఒకటి పెట్టాలి.
అలా పెట్టుకున్న పుల్కా లను చాపా లాగా చుట్టుకొవాలి...
చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకోవలి... కట్ చేసుకున్న ముక్కలను చపాతి కర్రతో పై పైన వత్తుకొవాలి.
ఒక గిన్నే తీసుకొని అందులో చెక్కర వేసి చెక్కర మునీగేదాక నీళ్ళు పొసి ,చెక్కర కరిగేంత వరకు వుంచి,లేత పాకం రానించి పొయ్యి ఆపాలి... బాండి పెట్టి  నూనే వేసి కాగిన తరువాత కట్ చేసుకున్న ముక్కలను వేయించి ...లేత పాకం లో వేసి 2 నిమిషాలు వుంచి ...తినడమే...అంతే మడత  కాజా తయారు...:)




No comments :

Post a Comment