Wednesday, October 16, 2013

సునాముఖి  చారు

కావాల్సిన పదార్థాలు
సునాముఖి ఆకు - కొద్దిగా
చింతపండు - కొద్దిగా
నీరు - ఒకటిన్నర లీటరు
ఉప్పు, కారం, పసుపే - తగినంత
పచ్చిమిర్చి - 1
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమీర - 1 కట్ట
జీలకర్ర, ఆవాలు - 1టీ స్పూన్‌

తయారు చేసే విధానం
ముందుగా నీళ్లలో సునాముఖి ఆ కు వేసి బాగా కాగనీయాలి. సునాముఖి ఆకు రసం అంతా నీళ్లలోకి దిగుతుంది. దాన్ని వడకట్టి అందులో చింతపండు బాగా పిసికి పిప్పిని పడేయాలి. అం దులో ఉప్పు, పసుపు, కరివేపాకు, కొతి ్తమీర, పచ్చమిర్చి ముక్కలు వేసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగాక చారు లో పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీల కర్ర, ఎండుమిర్చి ముక్కలు వేస్తే సరి. ఈ చారు ఎప్పుడూ రాత్రిళ్లు పెట్టుకుంటే మలబద్ధకం, అజీర్తి దరిరావు......

No comments :

Post a Comment