Friday, November 15, 2013

చింతకాయ చారు




కావలిసినవి 

చింతకాయలు-7
కంది పప్పు -1/4(పావ్)గ్లాస్
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపకాయలు-కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
కరివేపాకు -కొద్దిగా
కొత్తిమీర-కొద్దిగా

 చేసే విదానం

చింతకాయలు ను కడిగి,మిక్సి లో వేసుకొని,నీళ్ళు పొసి మిక్సి వేసి,రసం మాత్రమే తీసుకోవాలి...కందిపప్పు ని ఉడక పెట్టుకొవాలి...కంది పప్పు నీళ్ళు మాత్రమే తీసుకొవాలి...
ఈ రెండు నీళ్ళని కలిపి పొయ్యి మీద ఉడకపెట్టి,పసుపు కొద్దిగా,ఉప్పు,చారు పొడి వేసి బాగా  తెర్లనించి, తిర్వమాత(బాండి లో నూనె వేసి  అది కాగాగానే ఆవాలు,మినపప్పు,ఇంగువ,కరివేపాకు,ఎండు మిరపకాయ ముక్కలు,జీలకర్ర వేసి ఎర్రగా అయిన తరువాత చారు లో వేసి,కొత్తిమీర కూడ వేసి మూత పెట్టి 10 ని"లు అయిన తరువాత  ఘాటు బాగా వుంటుంది) పెట్టి అన్నం లొ తినడమే...

గమనిక: చింతకాయ తొక్కు తో కూడ చేసుకొవచ్చు

No comments :

Post a Comment