కావలిసినవి
బియ్యపు పిండి-1 1/4 కప్పు
బెల్లం- 1 కప్పు
కొబ్బరి తురుము(మీ ఇష్టము)
యాలకుల పొడి-రుచి కొసం
ఉప్పు-చాల కొద్దిగా
నీళ్ళు-1 1/2 కప్పు
నూనె లేదా నెయ్యి ---తగినంత
చేసే విదానం
గిన్నే లో నీళ్ళు తీసుకొని,బెల్లం దాని లో వేసి కరిగేంత వరకు తెర్ల పెట్టి,నెయ్యి లేక నూనె కొద్దిగా వెయ్యవలెను.
తరువాత బియ్యపు పిండి వేసి,బాగ కలిపి మూత పెట్టవలను...
చల్లారిన తరువాత వుండలు చేసుకొవాలి...
పాలాథిన్ కవర్ తీసుకొని దాని మీదా నూనె రాసి ఒక వుండను పెట్టి కొద్దిగ మందము గానే వత్తి,పెనం పెట్టుకొని,పెనం వేడి అవ్వగానే సిం లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకొవాలి...అంతే పెనం బూరెలు సిద్దం
దీని పేరు నాకు తెలియదు...అందుకే పెనం బూరెలు అని నామకరణం చేసా...:)
No comments :
Post a Comment