ఆలు కుర్మా
కావలిసినవి
ఉల్లి పాయలు-3
వేరు శనగ గుండ్లు-కొన్ని
తెల్లనువ్వులు-కొన్ని
పుట్నాలు-కొన్ని
అల్లం-కొద్దిగా
వెల్లులి-కొద్దిగా
కొబ్బరిముక్కలు-కొన్ని
చింతపండు -కొద్దిగా
నూనె-తగినంత
ఉప్పు-తగినంత
ఆలు(బంగాళా దుంప)-2
పసుపు-కొద్దిగా
గరం మసాల పౌడర్-కొద్దిగా
పెరుగు-కొద్దిగా
చేసే విదానం
ఉల్లి పాయల ను,బంగాళా దుంప ల ను తరుగు కొవాలి.
పాన్ తీసుకొని నూనె కొద్దిగా వేసి కాగిన తరువాత,ఉల్లి ముక్కలు,వేరు శనగ గుండ్లు ,తెల్లనువ్వులు,పుట్నాలు , అల్లం,వెల్లులి వేసి వేయించి,చల్లారాకా మిక్సి వేసుకొవాలి.
కొబ్బరి ముక్కల ను మిక్సి వేసి కొద్దిగా నీళ్ళు పోసి కొబ్బరి పాల ను తీసుకొవాలి.దాన్ని పాన్ లో వేసి ఉడకపెట్టవలను
చింత పండు ను కొద్దిగా తీసుకుని ...చింత పండు రసం చేసుకొని పాన్ లో పొయ్యవలను...
అలాగే తరుగుకున్న ఆలు ముక్కలు కూడ వెయ్యవలను...
బాగా కలిపి ఉప్పు వేసి బాగా కలిపి,పసుపు వేసి బాగా కలిపి,గరం మసాల పొడర్ వేసి బాగా కలిపి ,పెరుగు కూడ వేసి బాగా కలిపి,పాన్ మూత పెట్టి 2 కూతలు రానించి ,పాన్ మూత తీసి ఉడక పెట్టడమే...అంతే ఆలు కూర్మ సిద్దం ...
ఈ కూర చపాతి,బిర్యాని లోకి తింటే బావుంటుంది...
ఆలు కి బదులు వంకాయ లేక క్యాలి ఫ్లవర్ లేక పనీర్ వేసి చేసుకున్న బావుంటుంది
నేను cookingwithsiri సైట్ లో నుంచి చూసాను...Thq u very much for nice recipe

No comments :
Post a Comment